పాలిచ్చిన మగ మేక (Peddadevulapally)
కాన్పూర్ : ఈతువా జిల్లా అదియాపూర్ గ్రామంలో వింత చోటు చేసుకుంది. ఆడ మేకలు పాలివ్వడం చూశాం. కానీ ఓ మగ మేక పాలిచ్చింది. ఇలాంటి ఘటనలు అరుదు. అదియాపూర్ గ్రామానికి చెందిన ఉడాల్ సింగ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం సంతానోత్పత్తి కోసం మగ మేక(4 సంవత్సరాలు)ను కొనుగోలు చేశాడు. అయితే మూడు రోజుల క్రితం మగ మేక శరీరంలో మార్పులు కనిపించాయని సింగ్ తెలిపాడు.
మొదటి రోజు మేక 250 గ్రాముల పాలను ఇచ్చిందని చెప్పాడు. హార్మోన్ల ప్రభావంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని వెటర్నరీ అధికారి తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే క్షీరదాలు పాలు ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు. పాలిచ్చే మగ మేకను చూసేందుకు గ్రామస్తులు, సమీప గ్రామాల వారు సింగ్ నివాసానికి తరలివస్తున్నారు.

0 comments:
Post a Comment