Tuesday, January 26, 2016
Saturday, January 9, 2016
టీవీ చూస్తే లావైపోతారా ?
టీవీ చూస్తే లావైపోతారా ?
ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ? నిజమే టీవీ చూడటం వల్ల మీ బరువు పెరగడం మాత్రమే కాదు.. మీ ప్రాణాలకు కూడా ముప్పేనట. టీవీ మిమ్మల్ని ఎక్కువగా తినడానికి, తక్కువగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. టీవీ మనల్ని అలానే కూర్చుండిపోయేలా, అనర్థం కలిగించే విధంగా ఆహారం తీసుకునేలా చేసి.. శరీరంపై దుష్ర్పభావం కలిగేలా చేస్తుందట.
90 శాతం మంది పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోకుండా.. టీవీల ముందు కూర్చుని టైం పాస్ చేస్తున్నారు. పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. అలాగే పెద్దవాళ్లు కూడా.. రోజూ వ్యాయామం చేయకుండా.. కేవలం టీవీలు ఎక్కువగా చూడటానికే పరిమితమవుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినడానికి కారణమవుతోంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు.
గంటల కొద్దీ కూర్చోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. ఫ్యాట్ కరిగించడానికి కారణమయ్యే ఎంజైమ్స్ పనితీరు పూర్తీగా పడిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు, మధుమేహానికి అవకాశముంది. కాబట్టి.. టీవీలతో ఎంత ప్రమాదం ముంచి ఉందో ఇప్పుడు చూద్దాం..
1. ఏకాగ్రత
టీవీకి అడిక్ట్ అవడం వల్ల.. పూర్తీ ఏకాగ్రత టీవీపైనే ఉంటుంది. దీనివల్ల మీకు తెలియకుండానే.. మీరు ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఫుడ్ తీసుకోవడంలో కంట్రోల్ మిస్ అవుతారు. కాబట్టి మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. ఇలా పరిమితి లేకుండా తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరిగిపోతారు.
2. మెటబాలిజం
మెటబాలిజం బ్రెయిన్ కి లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే.. బ్రెయిన్ కాన్సంట్రేషన్ మొత్తం టీవీపై ఉంటుందో.. అప్పుడు ఆహార అలవాట్లు డిస్ర్టబ్ అవుతాయి. దీనివల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది.
3. బెల్లీ ఫ్యాట్
చాలామంది గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునిపోతారు. ఇలా ఎక్కువసేపు కూర్చుకోవడం, టీవీ చూస్తూ.. చిరుతిండ్లు తినడం వల్ల.. పొట్టలో కొవ్వు పేరుకుంటుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణమవుతుంది.
4. ఎనర్జీ
టీవీ చూడటం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు.. ఎనర్జీని కూడా కరిగించేస్తుంది. బరువు పెరిగేలా చేయడంతోపాటు.. నీరసించిపోయేలా చేస్తుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు అవకాశముంది.
5. అనారోగ్యకరమైన స్నాక్స్
టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు తినే చిరుతిండిపై ఎవరూ కాన్సంట్రేట్ చేయరు. ఏది పడితే అది లాగించేస్తారు. దీనివల్ల హై క్యాలరీ, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారు. దీనివల్ల ఈజీగా బరువు పెరగడానికి కారణమవుతుంది.
6. నిద్రలేమి
ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల ఫ్యాట్ పెరగడానికి, నిద్రలేమికి కూడా కారణమవుతుంది. ఎక్కువ సమయం టీవీ చూడటం వల్ల రాత్రి పడుకున్నప్పుడు కూడా.. మీ కళ్లలో టీవీ ప్రోగ్రామ్స్ మెదులుతూ ఉంటాయి. 8గంటల నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల బరువు పెరగడంతో పాటు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
7. చేతులకు పని లేకుండా
టీవీ చూసేటప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. ఇది అందరికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనివల్ల బర్గర్, పాప్ కార్న్ ఏదో ఒకటి లాగించడానికి వీలు దొరుకుతుంది. టీవీ మిమ్మల్ని బరువు పెంచడానికి కారణమవుతుంది అనడానికి ఇది ఒక కారణం.

Saturday, August 15, 2015
Tuesday, June 9, 2015
పాలిచ్చిన మగ మేక (Peddadevulapally)
పాలిచ్చిన మగ మేక (Peddadevulapally)
కాన్పూర్ : ఈతువా జిల్లా అదియాపూర్ గ్రామంలో వింత చోటు చేసుకుంది. ఆడ మేకలు పాలివ్వడం చూశాం. కానీ ఓ మగ మేక పాలిచ్చింది. ఇలాంటి ఘటనలు అరుదు. అదియాపూర్ గ్రామానికి చెందిన ఉడాల్ సింగ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం సంతానోత్పత్తి కోసం మగ మేక(4 సంవత్సరాలు)ను కొనుగోలు చేశాడు. అయితే మూడు రోజుల క్రితం మగ మేక శరీరంలో మార్పులు కనిపించాయని సింగ్ తెలిపాడు.
మొదటి రోజు మేక 250 గ్రాముల పాలను ఇచ్చిందని చెప్పాడు. హార్మోన్ల ప్రభావంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని వెటర్నరీ అధికారి తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లోనే క్షీరదాలు పాలు ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు. పాలిచ్చే మగ మేకను చూసేందుకు గ్రామస్తులు, సమీప గ్రామాల వారు సింగ్ నివాసానికి తరలివస్తున్నారు.

నిజమే.. పాపం పండింది! (peddadevulapally)
Peddadevulapally:
అధర్మం పెచ్చరిల్లినప్పుడు దేవుడు మాత్రం ఎంతవరకు సహిస్తాడు చెప్పండి! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో ఇదే జరిగింది. ఎపుడో 18 ఏండ్ల క్రితం అవినీతికి ఇంతకాలం తర్వాత శిక్ష విధిస్తారా? అని కొంతమంది నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే ఏమిటి?.. అందు కే ఆలస్యమైనా పాపం పండుతుందని పెద్దలు అనేది!.
.. ఇవీ గత సెప్టెంబర్‌లో జయలలిత జైలుకు వెళ్లినపుడు రాధాకృష్ణ కొత్తపలుకులో రాసిన ఆణిముత్యాలు. అందులో అధర్మాన్ని దేవుడు కూడా సహించడని చెప్పాడు. పాపం ఎప్పటికైనా పండుతుందని చెప్పాడు. అదే రాధాకృష్ణ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఏం రాస్తున్నాడు? అవినీతి మన జీవితంలో ఒక భాగమైపోయింది. రాజకీయాల్లో నీతి, నైతికత వెతకబోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. అని. అంటే రాధాకృష్ణ దృష్టిలో జయలలిత పట్టుబడితే పాపం పండినట్టు. అదే రేవంత్ దొరికితే కుట్రలు చేసినట్టు. పైగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు పెడితే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని కేసీఆర్ భావిస్తే ఈ ఉదంతం కాస్తా టీ కప్పులో తుఫానులా తేలిపోవచ్చు అని సిగ్గులేకుండా కొత్తపలుకులు పలుకుతున్నాడు. అంటే పట్టపగలు రెడ్ హ్యండెడ్‌గా దొరికిన వాడిని వదిలేయాలని సలహాలు చెప్తున్నాడు. సిగ్గు అనే పదం కూడా సిగ్గుతో చచ్చిపోతుంది!
దబాయింపు రాతలు..!
దాగబోయి దాగబోయి తలారి ఇంట్లో దూరినట్టు&ఓటుకు నోటు కేసులో రేవంత్ ఏసీబీకే అడ్డంగా దొరికిపోయాడు. అయి నా పచ్చమూక దబాయించి బయటపడాలని చూస్తున్నది. ఉమ్మడి పాలనలో నిర్మాత మీద కాల్పులు జరిపినా మసిపూసి మారేడు కాయ చేసినట్టు ఇపుడు కూడా బయట పడవచ్చుననుకుంటున్నది. ఎదుటివాళ్లు ఏ చిన్న తప్పు చేసినా మీడియా మాఫియాతో నానాయాగీ చేయించి ఆగమాగం చేసే పచ్చమూక ఇవాళ పట్టపగలు జరిగిన దారుణాలను కప్పిపుచ్చాలని భావిస్తున్నది. రాధాకృష్ణలాంటి వంతగాళ్లు ఆ కుట్రను అమలు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి వీడియో లో టీఆర్ఎస్ నాయకులు పట్టుబడి ఉంటే ఇదే రాధాకృష్ణ ఏం చేసి ఉండే వాడు? గతంలో కేటీఆర్‌తో ఫోటో దిగిన వ్యక్తి ఒకరు సెటిల్మెంట్ ఉదంతంలో పట్టుబడితే దాన్ని కేటీఆర్‌కు అంటగడుతూ ఎన్ని కథనాలు రాశాడు.ఎంత రచ్చ చేశాడు? ఇవాళ ఏకంగా చంద్రబాబే దొరికిపోతే ఎంత నిర్లజ్జగా సమర్థిస్తున్నాడు. రాజ్యసభ సభ్యత్వం కోసం ఇంత దిగజారాలా?
దొంగతనానికి లైసెన్సు ఉందా?..
ఉమ్మడి రాజధాని అట. ఫోన్ ట్యాపింగ్ అట. రాజ్యాంగమట. హక్కులట. డబ్బుల మూటలు విరజిమ్మి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవచ్చని విభజన చట్టం ఏమన్నా ప్రత్యేక హక్కులు ఇచ్చిందా? లేక రెడ్‌లైట్ ఏరియాలో వ్యభిచారానికి లైసెన్సు ఇచ్చినట్టు ఉమ్మడి రాజధానిలో ఏ వెధవ పనైనా చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏమన్నా లైసెన్సు తీసుకున్నదా? ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగవిరుద్ధమట. మరి తెలంగాణ సచివాలయం ఫైళ్లలో ఉండాల్సిన మెట్రో రైల్ ఉత్తర ప్రత్యుత్తరాల లేఖలు కొట్టేయడంరాజ్యాంగబద్ధమా? తెలంగాణ ప్రభుత్వం రూపొందించే ప్రతి పథకం సాప్ట్ కాపీలు నేరుగా ఏపీ సచివాలయానికి చేరడం రాజ్యాంగబద్ధమా? అధికార రహస్య పత్రాల తస్కరణ కేసు పెడితే ఏపీ సచివాలయంలో ఎందరు మిగులుతారు? ఏపీ ప్రభుత్వ సలహాదారు దానికి సిద్ధమా? గవర్నర్ బంగళాలో రాధాకృష్ణ కెమెరాలు రాజ్యాంగబద్ధమా? అంబటి రాంబాబు లాంటి వాళ్ల ఫోన్లను ట్యాప్ చేయడం ఆడవాళ్లతో హస్కీ గొంతులతో ఉచ్చులు బిగించడం నేరం కాదా? విదురుడి మేనమామ ధర్మపన్నాలు చెప్తున్నాడు.
మళ్లీ అదే తీరు..
ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకున్నదట... ఓ వైపు రేవంత్ వీడియోలు.. చంద్రబాబు సంభాషణల టేపులు అన్ని పత్రికలు టీవీల్లో ఊదరగొడుతుంటే రాధాకృష్ణ మీడియా మాత్రం కేటీఆర్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయాడోచ్ అంటూ ఓ కథ అల్లేశాడు. ఓ టేప్‌ను ప్రదర్శించి చంకలు గుద్దుకున్నాడు. రేవంత్ కేసులో స్టీఫెన్సన్ ఫిర్యాదు ఉంది. వీడియో సాక్షం ఉంది. పట్టుబడ్డ డబ్బుమూటలు ఉన్నాయి. బ్యాంకు లో లావాదేవీలు ఉన్నాయి. చంద్రబాబు ఆడియో కూడా ఉంది. మరి రాధాకృష్ణ ఆడియోలో ఏమున్నాయి? ఫిర్యాదులున్నాయా? డబ్బులున్నాయా? ధ్రువీకరించే సాక్ష్యాలున్నాయా?
నిజమే.. పాపం పండింది!
జయలలిత ఉదంతంపై కొత్తపలుకులో రాధాకృష్ణ ఓ గొప్పమాట చెప్పాడు. పాపం ఎప్పటికైనా పండుతుందని. నిజమే పచ్చమూక పాపం పండింది. పెద్దాయనను మొత్తుకోంగ సీటునుంచి గొరగొర గుంజేసిన పాపం ఇప్పటికి పండింది. రాత్రికి రాత్రి బస్సులు పెట్టి తెలంగాణ ఆపి వందల మంది యువకులను పొట్టనబెట్టుకున్న పాపం పండింది. బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని డబ్బుల మూటలతో అపహాస్యం చేయడానికి యత్నించిన పాపం పండింది. కరెంటు ఫీజులు పీకి రైతుల ఉసురు తీసిన పాపం పండింది. మీడియా మాఫియా అండతో తెలంగాణ సర్కారు మీద కుట్రలు చేసిన పాపం సంపూర్ణంగా పండింది. దుష్ట సంహారం ఇపుడే ప్రారంభమైంది. ఇక్కడితో ఆగదు. అమరుల ఉసురు ఊరకేపోదు! చంచల్‌గూడలో కంచాలు కడగడానికి కాలం ఆసన్నమైంది. రాధాకృష్ణ ఇది గుర్తించుకోవాలి.

Monday, June 8, 2015
నల్లగొండలో టీఆర్ఎస్ బహిరంగ సభ షురూ (peddadevulapally)
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కాలేజీ మైదానంలో టీఆర్ఎస్ బహిరంగ సభ షురూ అయింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాగానే సభ మొదలైంది. సీఎం వేదికపైకి చేరుకోగానే నేతలు ఆయనకు తలపాగా ధరింపజేసి సత్కరించారు. చేతికి దట్టి కట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ వేదికపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం రాక ముందు కళాకారులు తెలంగాణ ఆటాపాటలతో సభికులను ఆనందోత్సహాలలో హోరెత్తించారు. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తోపాటు పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఎం రాకకు పూర్వం టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.