Saturday, January 18, 2014

సులభంగా షుగర్‌టెస్ట్

Peddadevulapally;

గ్లూకోజ్‌పూవల్స్ కొద్దిగా పెరిగితే చాలు.. ఒళ్లంతా ఒణుకు.. డయాబెటిస్ పేషెంట్లు సాధారణంగా ఎదుర్కొనే సమస్యే ఇది! వెంటనే దగ్గర్లోని డయాగ్నస్టిక్ సెంటర్‌కి వెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి. అన్నం తిన్నాక మరోసారి. ఇకనుంచి ఇలా రక్తతర్పణం చేయాల్సిన అవసరం లేకుండానే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ని తెల్సుకోవచ్చు! ఎలాగంటారా? ప్రపంచంలో ప్రతి 19మందిలో ఒకరు డయాబెటిస్ బాధితులే! గ్లూకోజ్‌పూవల్స్‌ని గుర్తించడానికి రక్తపరీక్షలు కాకుండా ఇంకేదైనా మార్గముందా? ఇంట్నట్‌లో ఏదైనా సమాచారం దొరుకుతుందా? అని సెర్చ్ చేసేవారిసంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందట! దీంతో కంప్యూటర్ కార్యకలాపాలతోపాటు ఆరోగ్యసంబంధిత విషయాలపైనా పరిశోధనలు మొదలుపెట్టింది సెర్చ్‌ఇంజన్ సేవలందిస్తోన్న గూగుల్ సంస్థ. వీళ్లు తయారు చేసిన స్మార్ట్ కాంటాక్ట్‌పూన్స్‌ని ధరిస్తే చాలు.

lenceకన్నీరు తగలగానే కాంటాక్ట్‌పూన్స్‌లో ఏర్పాటు చేసిన పరికరాలు మన ఒంట్లో గ్లూకోజ్ పరిమాణం ఎంతుందో లెక్కగడతాయి. నియమిత పరిధికన్నా చక్కెర పరిమాణం ఎక్కువున్నా, తక్కువున్నా వెంటనే లెన్స్‌లో ఉండే అతిచిన్న ఎల్‌ఈడీ వెలుగుతూ రోగుల్ని అప్రమత్తం చేస్తుంది. ‘అదేంటి? పరికరాలు, లైట్లు.. ఇవన్నీ కంటికి గుచ్చుకోవా?’ అనే సందేహం అక్కర్లేదు. ఈ ఏర్పట్లన్నీ రెండు లెన్స్‌ల మధ్యలో ఉంటాయి కాబట్టి కంటిలో సులువుగా పెట్టుకోవచ్చు! ‘ప్రస్తుతానికైతే ప్రాథమిక పరిశోధనలన్నీ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పరీక్షల తర్వాత స్మార్ట్ కాంటాక్ట్‌పూన్స్‌ని మార్కెట్లోకి విడుదలచేస్తాం’అని గూగుల్ ప్రతినిధులు అంటున్నరు. త్వరలోనే డయాబెటిక్ పేషెంట్స్.. అతిసులువుగా షుగర్‌పూవల్స్‌ని చెక్ చేసుకోవచ్చు! అప్పటిదాకా ఎందుకు ఆలస్యం? వ్యాయామం అదీ చేసేస్తేపోలా?

0 comments: